- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ADB: భారత రూఫ్‌టాప్ సోలార్ విస్తరణకు రూ. 5,780 కోట్ల రుణాన్ని ఆమోదించిన ఏడీబీ
2027 నాటికి దేశంలోని కోటి ఇళ్లకు క్లీన్, సరసమైన విద్యుత్ అందుబాటులోకి తీసుకురావడానికి వీలవుతుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ప్రభుత్వం రూఫ్‌టాప్ సోలార్ అడాప్షన్‌ను వేగవంతం చేసేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) 650 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 5,780 కోట్లు) పాలసీ ఆధారిత రుణాన్ని ఆమోదించింది. ఈ రుణం ద్వారా 2027 నాటికి దేశంలోని కోటి ఇళ్లకు క్లీన్, సరసమైన విద్యుత్ అందుబాటులోకి తీసుకురావడానికి వీలవుతుంది. యాక్సిలరేటింగ్ అఫర్డబుల్ అండ్ ఇన్‌క్లూజివ్ రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఫైనాన్సింగ్ ద్వారా ప్రభుత్వ ప్రధాన పథకం ప్రధాన్ మంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన (పీఎమెస్‌జీఎంబీవై)కు సహకారం అందిస్తుందని ఏడీబీ వెల్లడించింది. ఈ పథకం రూఫ్‌టాప్ సౌర వ్యవస్థలను దేశవ్యాప్తంగా విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రారంభించారు. పరిమిత నిధులు, నియంత్రణ సవాళ్లతో సహా రూఫ్‌టాప్ సోలార్ విస్తరణకు దీర్ఘకాలంగా ఉన్న అడ్డంకులను తొలగించడం ద్వారా దేశ క్లీన్ ఎనర్జీ పరివర్తనను ఈ కార్యక్రమం వేగవంతం చేస్తుందని ఏడీబీ ఇండియా కంట్రీ డైరెక్టర్ మియో ఓకా అన్నారు. ఈ రుణ సౌకర్యం గ్రీన్ ఉద్యోగాలను సృష్టించడం, మహిళలకు సాధికారత కల్పించడం, విద్యుత్ రంగం ఆర్థిక ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తూ లక్షలాది గృహాలకు రూఫ్‌టాప్ సోలార్‌ను సరసమైన, అందుబాటులో ధరలో లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.






