SEBI: అదానీ మేనల్లుడిపై సెబీ ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు

by S Gopi |

ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించేందుకు వచ్చిన ఆరోపణలకు తగిన పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పారు.

SEBI: అదానీ మేనల్లుడిపై సెబీ ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: బిలియనీర్ గౌతమ్ అదానీ మేనల్లుడు, అదానీ గ్రూప్ కంపెనీలకు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపడుతున్న ప్రణవ్ అదానీపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేసింది. కంపెనీ ఒప్పంద సమాచారం పంచుకున్నారని, తద్వారా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి నిబంధనలు ఉల్లఘించారని సెబీ ఆరోపించింది. దీనికి సంబంధించి సెబీ గతేడాది ప్రణవ్ అదానీకి నోటీసులు కూడా ఇచ్చింది. తన మీద వచ్చిన ఆరోపణలపై ప్రణవ్ అదానీ ఏ విషయాన్ని వెల్లడించలేదు. తాజాగా ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించేందుకు వచ్చిన ఆరోపణలకు తగిన పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నానని, తాను ఎటువంటి సెక్యూరిటీల చట్టాన్ని ఉల్లంఘించలేదని చెప్పారు. అయితే, ఈ విషయం సెటిల్‌మెంట్ చేసేందుకు అవసరమైన చర్చలు జరుపుతునట్టుగా సమాచారం ఉన్నట్టు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. కాగా, ప్రణవ్ అదానీ 2021లో ఎస్‌బీ ఎనర్జీ హోల్డింగ్స్‌ను అదానీ గ్రీన్ ఎనర్జీ కొనుగోలు చేసే సమాచారాన్ని ఒప్పందం కంటే ముందుగా తన సన్నిహితులతో పంచుకున్నారని సెబీ ఆరోపించింది. ఈ విషయంపై దర్యాప్తు సమయంలో కాల్ రికార్డులు, ట్రేడింగ్ విధానాలను సెబీ అధికారులు విశ్లేషించారు. ప్రణవ్ అదానికి చెందిన సన్నిహితులు కునాల్ షా, నృపాల్ షా అదానీ గ్రీన్ షేర్లను క్రయవిక్రయల ద్వారా రూ. 90 లక్షలకు పైగా లాభాలను ఆర్జించారని సెబీ పేర్కొంది.

Next Story