అదానీ పవర్ షేర్.. మార్కెట్ పతనంలోనూ 4.97 శాతం భారీ వృద్ధి

by Kema Shiva Kumar |

స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ఉన్నప్పటికీ, అదానీ పవర్ షేర్లు వృద్ధిని నమోదు చేస్తూ ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.

అదానీ పవర్ షేర్.. మార్కెట్ పతనంలోనూ 4.97 శాతం భారీ వృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ఉన్నప్పటికీ, అదానీ పవర్ లిమిటెడ్ (Adani Power Ltd) షేర్లు అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఈ స్టాక్ 4.97 శాతం పెరిగి రూ.145.75 గరిష్ట స్థాయిని తాకింది. సెన్సెక్స్ 1.09 శాతం పడిపోయినప్పటికీ, అదానీ పవర్ 3.82 శాతం లాభంతో ముగిసింది. గత రెండు రోజులుగా కొనసాగుతున్న నష్టాలకు ఈ వద్ధితో బ్రేక్ పడింది. ప్రస్తుతం ఈ షేరు 200 జుల మూవింగ్ యావరేజ్ కంటే పైన ట్రేడ్ అవుతోంది. గతేడాదిలో ఈ స్టాక్ 40.21 శాతం వృద్ధిని సాధించగా, గత ఐదేళ్లలో ఏకంగా 851.66 శాతం లాభాలను ఇన్వెస్టర్లకు అందించింది. అదానీ పవర్ ప్రస్తుత ధరలో బలంగా ఉన్నప్పటికీ, ప్రముఖ అనలిటికల్ ప్లాట్‌ఫామ్ ‘MarketsMojo’ దీనికి అమ్ముకోవచ్చు అనే రేటింగ్‌ను ఇచ్చింది.

Next Story