- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Adani Group: అదానీ చేతికి స్టార్ సిమెంట్.. ఖండించిన సంస్థ..!
అదానీ గ్రూప్(Adani Group)కు చెందిన సిమెంట్ కంపెనీ అంబుజా సిమెంట్(Ambuja Cement) నార్త్ ఈస్ట్ ఇండియాలో కార్యకలాపాలు సాగిస్తున్న స్టార్ సిమెంట్(Star Cement) సంస్థను కొనుగోలు చేయడానికి ట్రై(Try) చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: అదానీ గ్రూప్(Adani Group)కు చెందిన సిమెంట్ కంపెనీ అంబుజా సిమెంట్(Ambuja Cement) నార్త్ ఈస్ట్ ఇండియాలో కార్యకలాపాలు సాగిస్తున్న స్టార్ సిమెంట్(Star Cement) సంస్థను కొనుగోలు చేయడానికి ట్రై(Try) చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే స్టార్ ఇండియా ఆ వార్తలను కొట్టిపారేసింది. అదానీ గ్రూప్ తో కొనుగోలుకు సంబంధించి తాము ఎటువంటి చర్చలు జరపలేదని, ఇంగ్లీష్ న్యూస్ పేపర్(English Newspaper)లో వచ్చిన ఆ వార్త పూర్తిగా అవాస్తమని, అందులో నిజం లేదని తెలిపింది. అలాగే రూ. 400 కోట్లతో అస్సాం(Assam)లోని సిల్చార్(Silchar) వద్ద మరో సిమెంట్ ప్లాంట్(Cement Plant) నిర్మిస్తున్నామని పేర్కొంది. ఈ కొత్త ప్లాంట్ ద్వారా 2 మిలియన్ టన్నుల సిమెంట్ ప్రొడ్యూస్ చేస్తామని, 2026 లేదా 2027 లో ఈ ప్లాంట్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని వెల్లడించింది.






