Adani Group: ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన తయారీ గమ్యస్థానంగా భారత్

by S Gopi |

కావ్డా ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి, 2030 నాటికి పూర్తి 37 గిగావాట్ల సామర్థ్యాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

Adani Group: ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన తయారీ గమ్యస్థానంగా భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ రాబోయే ఐదేళ్లలో కచ్ ప్రాంతంలో రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉందని ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి, తయారీ గమ్యస్థానాల్లో ఒకటిగా భారత్ మరింత బలోపేతం అవుతుందని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎండీ కరణ్ అదానీ తెలిపారు. ఆదివారం ప్రారంభమైన వైబ్రంట్ గుజరాత్ సమావేశంలో మాట్లాడిన ఆయన.. కావ్డా ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి, 2030 నాటికి పూర్తి 37 గిగావాట్ల సామర్థ్యాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రాబోయే 10 ఏళ్లలో ముంద్రాలో కంపెనీ పోర్ట్ సామర్థ్యాన్ని కూడా రెట్టింపు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఈ పెట్టుబడుల్లో దేశ జాతీయ ప్రాధాన్యతలు, ఉపాధి కల్పన, పారిశ్రామిక పోటీ, స్థిరత్వం, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థ అనిశ్చితి, సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో, భారత్ ఒక ప్రకాశవంతమైన ప్రదేశంగా ఎదుగుతోంది. దేశ వృద్ధి 8 శాతానికి దగ్గరగా పెరగడమే కాకుండా, తయారీని విస్తరిస్తోంది, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా మారే దిశగా పురోగమిస్తోందని పేర్కొన్నారు.

Next Story