- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Adani Group: దేశీయ తొలి హైడ్రోజన్ ప్లాంటు ఏర్పాటు చేసిన అదానీ గ్రూప్
క్లీన్ ఎనర్జీ రంగంలో కీలక మైలురాయి అని అదానీ గ్రూప్ సోమవారం ప్రకటనలో తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా బిలియనీర్, గౌతమ్ అదానికి చెందిన అదానీ గ్రూప్ భారత తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును ప్రారంభించింది. గుజరాత్‌లోని కచ్‌లో ఏర్పాటు చేసిన ఈ మొదటి ఆఫ్‌గ్రిడ్ 5మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ క్లీన్ ఎనర్జీ రంగంలో కీలక మైలురాయి అని అదానీ గ్రూప్ సోమవారం ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాంట్ లక్ష్యం ప్రధానంగా, విండ్, సోలార్ లాంటి పునరుత్పాదక వనరుల ద్వారా నీటిని ఎలక్ట్రోలైసిస్ ప్రక్రియ ద్వారా విభజించి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేశారు. దీనికోసం అదానీ గ్రూప్ తన సొంత పునరుత్పాదక ప్లాంట్లను ఉపయోగించనుంది. గ్రీన్ హైడ్రోజన్ కోసం ఏర్పాటు చేసిన అత్యాధునిక ప్లాంట్ సౌరశక్తితో 100 శాతం గ్రీన్-పవర్డ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్)తో అనుసంధానం చేశారు. ఇది పూర్తిగా ఆఫ్-గ్రిడ్‌లో పనిచేస్తుంది. దేశీయ అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా ఉండేందుకు కేంద్రం ప్రారంభించిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి హబ్‌గా భారత్‌ను నిలపాలనే లక్ష్యానికి అదానీ గ్రూప్ తనవంతుగా సహకారం అందిస్తుందని సంస్థ తెలిపింది. గుజరాత్‌లోని ముంద్రాలోనూ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను అదానీ గ్రూప్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, హైడ్రోజ్ఞ్ అనేది విశ్వంలో లభించే అత్యంత స్వచ్ఛమైన, తేలికైన వాయువు. దీన్ని మండిస్తే నీటి ఆవిరి ఉత్పత్తి అవుతుంది.






