Adani Energy: దేశంలోనే అతిపెద్ద ట్రాన్స్‌మిషన్‌ ఆర్డర్‌ పొందిన అదానీ ఎనర్జీ

by S Gopi |

ఈ ఆర్డర్ చేజిక్కించుకోవడం ద్వారా కంపెనీ ఆర్డర్ బుక్ విలువ రూ. 54,761 కోట్లకు చేరినట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది

Adani Energy: దేశంలోనే అతిపెద్ద ట్రాన్స్‌మిషన్‌ ఆర్డర్‌ పొందిన అదానీ ఎనర్జీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రైవేట్ రంగ ట్రాన్స్‌మిషన్ కంపెనీ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ దేశంలోనే అతిపెద్ద ట్రాన్స్‌మిషన్ ఆర్డర్‌ను సాధించింది. రాజస్థాన్‌లోని బలా-ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ హెచ్‌వీడీసీ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నట్టు మంగళవారం ప్రకటనలో అదానీ కంపెనీ వెల్లడించింది. ఈ ఆర్డర్ చేజిక్కించుకోవడం ద్వారా కంపెనీ ఆర్డర్ బుక్ విలువ రూ. 54,761 కోట్లకు చేరినట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అదానీ ఎనర్జీ కంపెనీ రాజస్థాన్ నుంచి 6 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్తరాదిలోని ప్రాంతాలకు సరఫరా చేస్తుంది. టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్(టీబీసీబీ) విధానంలో ఈ ప్రాజెక్టును సొంతం చేసుకున్నామని, కొత్త టెక్నాలజీ ఆధారంగా రాబోయే నాలుగన్నరేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని కంపెనీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత కార్బన్ రహిత లక్ష్యాల్లో అదానీ ఎనర్జీ తనవంతు పాత్రను పోషిస్తుందని, సకాలంలో దీన్ని పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అదానీ ఎనర్జీ సీఈఓ కందర్ప్ పటేల్ వెల్లడించారు.

Next Story