- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Accenture: ఒకేసారి 50,000 మందికి ప్రమోషన్లు ఇవ్వనున్న యాక్సెంచర్
కంపెనీ ఆరు నెలలుగా ప్రమోషన్లను వాయిదా వేస్తూ వస్తోంది

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ తన ఉద్యోగులకు భారీ శుభవార్త ప్రకటించింది. అంతర్జాతీయంగా ఉన్న ఉద్యోగుల్లో 50,000 మందికి ఒకేసారి ప్రమోషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపింది. దీంతో మనదేశంలోనే 15,000 మంది వరకు ఈ ప్రయోజనాన్ని పొందనున్నారు. యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికా ప్రాంతంలో 11,000 మందికి, అమెరికాలో 10,000 మందికి ఈ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ఏడాది కంపెనీ కన్సల్టింగ్ సేవల డిమాండ్ గణనీయంగా క్షీణించింది. ఈ కారణంతో కంపెనీ ఆరు నెలలుగా ప్రమోషన్లను వాయిదా వేస్తూ వస్తోంది. అయితే, ఉద్యోగుల్లో అసంతృప్తిని తగ్గించి, ఉత్సాహాన్నిచ్చేందుకు జూన్ నెలలో ఉద్యోగులకు ప్రమోషన్ ఇస్తున్నట్టు కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉద్యోగులకు ఇంటర్నల్ మెమోలు పంపినట్టు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ప్రస్తుతం యాక్సెంచర్ కంపెనీలో మొత్తం 8,01,000 మంది ఉద్యోగులున్నారు. వీరిలో 6 శాతం మంది ప్రమోషన్లు అందుకోనున్నారు. కొవిడ్-19 మహమ్మారి తర్వాత నియామకాల ఊపందుకోవడంతో పరిశ్రమ వ్యాప్తంగా డిమాండ్ క్షీణతను ఎదుర్కొంటున్న అనేక ప్రధాన కన్సల్టింగ్ సంస్థలలో యాక్సెంచర్ ఒకటి. క్లయింట్ వ్యయం తగ్గడం, ప్రపంచ మార్కెట్లలో పెరిగిన అనిశ్చితి వల్ల కంపెనీ 2023లో 19,000 ఉద్యోగాలను కూడా తొలగించింది.






