- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trade: అమెరికా సుంకం వల్ల రూ. 4.2 లక్షల కోట్ల విలువైన వస్తువులపై ప్రభావం
మనదేశ వస్తువుల ఎగుమతుల్లో దాదాపు 48.2 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ప్రభావితమవుతాయని అంచనా

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌పై విధించిన అదనపు దిగుమతి సుంకాన్ని అమెరికా డబుల్ చేసి 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. దీనివల్ల మనదేశ వస్తువుల ఎగుమతుల్లో దాదాపు 48.2 బిలియన్ డాలర్ల(రూ. 4.2 లక్షల కోట్ల) విలువైన వస్తువులు ప్రభావితమవుతాయని అంచనా వేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జతిన్ ప్రసాద అన్నారు. మంగళవారం అమెరికా సుంకాల గురించి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో.. ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు, రైతులు, కార్మికులు, వ్యవస్థాపకులు, ఎగుమతిదారులు, ఎంఎస్ఎంఈలు, పరిశ్రమ వర్గాల రక్షణకు కట్టుబడి ఉంది. ఎగుమతి ప్రోత్సాహకాలు, ఇతర మార్కెట్లకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి చర్యల ద్వారా వాణిజ్యంపై ప్రభావాన్ని తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. రష్యా చమురు కొనుగోలును కొనసాగిస్తున్న కారణంతో అమెరికా భారత్‌పై జరిమానా రూపంలో అదనంగా సుంకాన్ని విధించింది. ఇది ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నందున భారత ఉత్పత్తులపై మొత్తం 50 శాతం పన్ను భారం పడనుంది.






