- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇకపై రెస్టారెంట్లకు వెళ్లాలంటే ఆధార్ తప్పనిసరి!
ఇకపై రెస్టారెంట్ కి వెళ్లాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం.

దిశ, వెబ్ డెస్క్ : ఇకపై రెస్టారెంట్ కి వెళ్లాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. రెస్టారెంట్లకు మాత్రమే కాదు హోటల్స్, సొసైటీలకు వెళ్లినా ఆధార్ కార్డ్ యాక్సెస్ తప్పనిసరి అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రోజువారీ జీవితంలో ఆధార్ వినియోగాన్ని మరింత పెంచే దిశగా UIDAI త్వరలో ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ విధానాన్ని తీసుకురాబోతుంది.
ఇందుకోసం కొత్త యాప్‌ను ప్రవేశపెడతామని ఇటీవల ప్రకటించింది ఆధార్ ఒరిజినల్ చూపించడంతోపాటు జిరాక్స్ కాపీ ఇవ్వడం వల్ల వ్యక్తుల కీలక వివరాలు దుర్వినియోగమవుతున్నందున, దీన్ని నివారించడానికి ఆధార్ కార్డుపై వివరాలు లేకుండా కేవలం క్యూఆర్ కోడ్, ఫొటో మాత్రమే ఉండేలా మార్పు తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉంది. 'ప్రూఫ్ ఆఫ్ ప్రజెన్స్' అనే సరికొత్త సాంకేతికతను వాడి UIDAI సర్వర్లకు కనెక్ట్ కాకుండానే ముఖాన్ని స్కాన్ చేసి వ్యక్తిని ధ్రువీకరిస్తుంది.
ఈ విధానం అమల్లోకి వస్తే హోటళ్లు, రెస్టరంట్లు, లాడ్జ్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఆఫీసులు, డేటా కేంద్రాలు, ఆసుపత్రులు, పరీక్షల్లో విద్యార్థులు, సినిమా హాళ్లు, స్టేడియాలు, కచేరీలు వంటి అనేక చోట్ల ఆధార్ యాక్సెస్‌తో ఎంట్రీ అవకాశం ఉంటుంది. ప్రస్తుతం యాప్ టెస్టింగ్ చివరి దశలో ఉండగా త్వరలో ఇది అందుబాటులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.






