- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Reliance Group: ఈడీ సోదాలపై స్పందించిన అనిల్ అంబానీ
రిలయన్స్ పవర్‌కు ఆర్‌కామ్ లేదా ఆర్‌హెచ్ఎఫ్ఎల్‌తో ఎటువంటి వ్యాపారం లేదా ఆర్థిక సంబంధాలు లేవనిస్పష్టం చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈడీ సోదాలపై గురువారం సాయంత్రం ఆలస్యంగా స్పందించిన రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబాని కేసు గురించి వివరణ ఇచ్చారు. ఈడీ ఆరోపణలను ఖండించిన ఆయన, యెస్ బ్యాంక్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌కు సంబంధించిన లావాదేవీలు 8 ఏళ్ల పాతవని తెలిపింది. అలాగే, రిలయన్స్ పవర్‌కు ఆర్‌కామ్ లేదా ఆర్‌హెచ్ఎఫ్ఎల్‌తో ఎటువంటి వ్యాపారం లేదా ఆర్థిక సంబంధాలు లేవని, రిలయన్స్ పవర్ ప్రత్యేక, స్వతంత్ర లిస్టెడ్ కంపెనీ అని స్పష్టం చేసింది. ఈడీ ఆరోపిస్తున్న రుణాలు చట్టబద్ధమైనవి, పూర్తిగా సురక్షితమైనవని, వాటి చెల్లింపులు కూడా పూర్తయ్యాయని రిలయన్స్ గ్రూప్ ప్రకటన జారీ చేసింది. యెస్ బ్యాంకు నుంచి మంజూరు అయిన రుణాలు అవసరమైన అన్ని ప్రక్రియలను అనుసరించిన తర్వాత, అర్హత ఆధారంగా వచ్చినవే. 30 మందికి పైగా వ్యక్తులతో కూడిన క్రెడిట్ కమిటీ ద్వారా సక్రమమైన పద్ధతిలో ఆమోదించినవి. ఈ రుణాలు పూర్తిగా సురక్షితమైనవని, వడ్డీతో సహా పూర్తిగా తిరిగి చెల్లించామని, కాబట్టి తమకు బకాయిలేమీ లేవని కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంలోనే ఇటీవల ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌ను 'ఫ్రాడ్' అకౌంట్‌గా వర్గీకరించిన అంశాన్ని ప్రస్తావించిన రిలయన్స్ గ్రూప్.. ఆరు సంవత్సరాలకు పైగా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్ కోడ్-2016 ప్రకారం కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్(సీఐఆర్‌పీ) పరిధిలో ఉంది. దీనికి సంబంధించిన విషయాలు ఎన్‌సీఎల్టీ, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.






