- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Budget 2025: నిర్మలమ్మ కరుణిస్తారా? ఈ సారైనా ఉద్యోగాలు వస్తాయా? ఈ 8 అంశాలే బడ్జెట్‌లో కీలకం
Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ లో ప్రవేశపెట్టునున్నారు

దిశ, వెబ్ డెస్క్: Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ లో ప్రవేశపెట్టునున్న 8వ బడ్జెట్(Budget 2025) పై పన్ను చెల్లింపుదారులు(Taxpayers), టెక్(Tech), హెల్త్ కేర్(Health Care), ఇన్సూరెన్స్)Insurance), ఫైనాన్స్ సెక్టార్లు(finance sectors) భారీగా అశలు పెట్టుకున్నారు. బడ్జెట్ 2025-26కి సంబంధించిన పనిని ప్రారంభించే ముందు జనవరి 6వ తేదీన పలు వాటాదారులు, యూనియన్లు, ఇతర ప్రతినిధులతో ప్రీ బడ్జెట్ సంప్రదింపులు నిర్మలా సీతారామన్ జరిపారు.
జనవరి 31వ తేదీ నుంచి కేంద్ర బడ్జెట్(Budget 2025) సమావేశాలు షురూ కానున్నాయి. సెషన్ లో మొదటి భాగం జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 13,2025 తేదీన ముగుస్తుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెడతారు. సెషన్ లోని రెండవ భాగం మార్చి 10 ప్రారంభమై.. ఏప్రిల్ 4 వ తేదీన ముగుస్తుంది.
అయితే ఇప్పుడు అందరి చూపు ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ ప్రసంగం మీదే ఉంది. వేగంగా డెవలప్ చెందుతున్న ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న ఆకాంక్షల మధ్య 2025 కేంద్ర బడ్జెట్ పన్నుల సరళీకరణ(Central Budget Tax Simplification), పౌరుల సాధికారత, వ్రుద్దిని పెంచడం లక్ష్యంగా ప్రోత్సాహకాలు, సంస్కరణలు ఉంటాయని అంతా భావిస్తున్నారు.
జీఎస్టీ మరింత సరళీక్రుతం(GST):
వ్యాపార సంస్థలు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమలు హేతుబద్ధమైన జీఎస్టీ(GST)స్లాబ్స్, వేగవంతమైన ఐటీ రిటర్న్స్ ను ఆశిస్తున్నాయి. మరింత సరళమైన జీఎస్టీ వ్యవస్థ వ్యాపారాన్ని సులభం చేయడంతోపాటు ఆర్థిక కార్యకలాపాలను మరింత పెంచుతుంది.
కాగా ఈ బడ్జెట్ లో హౌసింగ్ లోన్ వడ్డీ మినహాయింపులు పెరుగుతాయని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఇంటి నిర్మాణం మరింత సులభం అవుతుందని భావిస్తున్నారు. ట్యాక్స్ విషయంలో సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ ప్రయోజనాలు, ఎక్కువ రాయితీలు అధిక మినహాయింపులు మధ్య తరగతి కుటుంబాలకు అవసరమైన ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తాయి.
క్యాటిపటల్ గెయిన్స్ ట్యాక్స్(Capital Gains Tax):
ఈక్విటీలు, రియల్ ఎస్టేట్స్ లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు మూలధన లాభాలు ట్యాక్స్ ప్రేమ్ వర్క్స్ సరళీక్రుతం చేయోచ్చని భావిస్తున్నారు. ఆస్తి తరగతుల్లో ఏకరీతి పన్ను రేట్లు గందరగోళాన్ని తగ్గించడం, ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఆకర్షించే ఛాన్స్ ఉంటుంది.
క్రిప్టో కరెన్సీ ట్యాక్స్ పై మరింత స్పష్టత(cryptocurrency taxes):
క్రిప్టో రంగం స్పష్టమైన రూల్స్, ట్యాక్స్ కోసం వేచి చూస్తోంది. పెరుగుతున్న ఈ డిజిటల్ అసెట్ మార్కెట్ కు ఈ బడ్జెట్ లో పారదర్శకత, చట్టపరమైన స్థిరత్వాన్ని తీసుకువచ్చే నిబంధనలు న్యాయపరమైన ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
జీతం పొందే వ్యక్తుల కోసం (Standard Deduction Limit):
పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి నెలసరి జీతాలు పొందేవారికి ప్రభుత్వం ఉపశమనం అందిస్తుందని భావిస్తున్నారు. దీనికోసం స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ పెంచుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఉద్యోగ అవకాశాలు (Job opportunities)
బడ్జెట్ పలు రంగాల్లో ఉపాధిని కల్పించే లక్ష్యంతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, స్కిల్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ కోసం నిధులను కేటాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మహిళా ట్యాక్స్ పేయర్స్ ప్రోత్సాహకాలు(Incentives for women taxpayers)
మహిళా నిపుణుల కోసం ప్రత్యేక పన్ను మినహాయింపులు లేదా తగ్గింపులు ప్రవేశ పెట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మహిళలకు ఆర్థికంగా సాధికారత కల్పించడం, శ్రామికశక్తిలో వారిని ప్రోత్సహించే విధంగా ప్రత్యేకంగా మినహాయింపులు ఉండే అవకాశం ఉంది.
పన్ను సంస్కరణలు(Tax reforms)
ఐటీ రిటర్న్స్ ప్రాజెస్ ను మరింత ఈజీ చేయడం, ట్యాక్స్ రూల్స్ సరళతరం అవుతాయని భావిస్తున్నారు. అటు వ్యక్తులు, ఇటు వ్యాపార సంస్థలు రెండింటికి మేలు చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెడుతుందని ముఖ్యంగా పేపర్ వర్క్స్ తగ్గించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.






