Gold Reserves: అత్యధిక బంగారం నిల్వలున్న దేశాలివే.. భారత్‌కు 8వ ర్యాంక్

by S Gopi |

గతంలో కంటే ఇటీవల కొన్నేళ్లలో చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు విపరీతంగా పసిడి నిల్వలను పెంచుకుంటున్నాయి.

Gold Reserves: అత్యధిక బంగారం నిల్వలున్న దేశాలివే.. భారత్‌కు 8వ ర్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం నిల్వలు ఏ దేశానికైనా ఆర్థిక స్థిరత్వానికి చాలా కీలకం. ఈ కారణంతోనే ప్రతిదేశం ఎప్పటికప్పుడు బంగారాన్ని నిల్వ చేసుకుంటాయి. అయితే, గతంలో కంటే ఇటీవల కొన్నేళ్లలో చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు విపరీతంగా పసిడి నిల్వలను పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా ఇటీవల భౌగోళిక రాజకీయ పరిణామాలు, వాణిజ్య సవాళ్లు, ఆర్థిక అనిశ్చితి, యుద్ధ పరిస్థితుల మద్య అనేక దేశాలు వీలైనంత ఎక్కువ బంగారం నిల్వలకు ఆసక్తిగా ఉన్నాయి. తాజా అత్యధికంగా బంగారు నిలలు ఉన్న ఎనిమిది దేశాల జాబితాను ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) విడుదల చేసింది.

ఆ డేటా ప్రకారం భారత్ స్థానం ఎక్కడ ఉందో తెలుసుకుందాం. ఈ జాబితాలో అమెరికా 8,133.5 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉంది. ఈ మొత్తం విదేశీ మారక నిల్వలలో దాదాపు 71 శాతాం వాటా కలిగి ఉంది. తర్వాత స్థానంలో జర్మనీ 3,351.5 మెట్రిక్ టన్నులు, విదేశీ మారక నిల్వలలో దాదాపు 70.6 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఇటలీ 2,451.8 మెట్రిక్ టన్నులతో మొత్తం విదేశీ మారక నిల్వలలో దాదాపు 67.5 శాతం, 2,437 మెట్రిక్ టన్నులు, విదేశీ మారక నిల్వలలో దాదాపు 68.6 శాతం వాటాతో ఫ్రాన్స్, 2,335.9 మెట్రిక్ టన్నులు, విదేశీ మారక నిల్వలలో దాదాపు 28.1 శాతం వాటాతో రష్యా, 2,279.6 మెట్రిక్ టన్నులు, విదేశీ మారక నిల్వలలో దాదాపు 4.6 శాతం వాటాతో చైనా, 1,040 మెట్రిక్ టన్నులు, విదేశీ మారకపు నిల్వలలో దాదాపు 8 శాతం వాటాతో స్విట్జర్లాండ్, 876.2 మెట్రిక్ టన్నులు, విదేశీ మారక నిల్వలలో దాదాపు 9 శాతం వాటాతో భారత్ టాప్-8 ర్యాంకుల్లో ఉన్నాయి.

Next Story