దీపావళికి 60 శాతం వ్యాపారాలు పెరుగుతాయని ఆశిస్తున్న సీఏఐటీ!

by Disha Web Desk 16 |
దీపావళికి 60 శాతం వ్యాపారాలు పెరుగుతాయని ఆశిస్తున్న సీఏఐటీ!
X

న్యూఢిల్లీ: గతేడాది కంటే ఈ ఏడాది దీపావళి సీజన్‌లో వ్యాపారాలు 60 శాతం పెరుగుతాయని ఆశిస్తున్నట్టు సీఏఐటీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది దీపావళి సీజన్‌లో వ్యాపారులు, రిటైలర్లు రూ. 1.25 లక్షల కోట్ల విలువైన పండుగ అమ్మకాలను నమోదు చేశారని ట్రేడర్స్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) పేర్కొంది.

చైనా దిగుమతులకు బదులుగా దేశీయ వస్తువులను కొనడం వల్ల చైనాకు గతేడాది రూ. 40 వేల కోట్లు చైనాకు నష్టం ఏర్పడిందని, ఈసారి దాదాపు రూ. 50 వేల వరకు ఉండొచ్చని సీఏఐటీ అభిప్రాయపడింది. గత నెల 26 నుంచి సెప్టెంబర్ 5 వరకు దసరా సమయంలో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల్లో 12 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్‌లో 15 శాతం, ఎలక్ట్రానిక్స్ 20 శాతం అమ్మకాలు వెద్ధి చెందాయి.

అలాగే, మొబైల్‌లో 10 శాతం, కిరాణా 20 శాతం, బొమ్మలు 15 శాతం అమ్మకాలు పెరిగినట్టు సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బి సి భారతియా అన్నారు. గత రెండేళ్ల కాలంలో వినియోగదారుల్లో కొనుగోలు ప్రవర్తన చాలా మారిపోయింది. వ్యాపారుల వద్ద ఉన్న వస్తువుల్లో చైనా ఉత్పత్తులు కాదని తెలిసిన తర్వాతే చాలామంది కొంటున్నారు. దీనివల్ల దేశీయ బ్రాండ్లకు గిరాకీ పెరిగింది. ఇది దేశ ఆర్థికవ్యవస్థకు అతిపెద్ద సానుకూలం. ఈ కారణంగానే ప్రస్తుత ఏడాది దీపావళి పండుగ సీజన్‌కు చైనా నుంచి ఎలాంటి వస్తువులను ఆర్డర్ చేయలేదని భారతియా పేర్కొన్నారు.


Next Story

Most Viewed