- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Skill Jobs: స్కిల్స్ పాతబడతాయని ఉద్యోగుల్లో ఆందోళన
భవిష్యత్తులో తమ ఉద్యోగాలు ప్రభావితం అవుతాయని దేశీయంగా సగానికి పైగా ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా టెక్నాలజీ అత్యంత వేగవంతంగా విస్తరిస్తోంది. అయితే, మారుతున్న టెక్నాలజీ అవసరాల కారణంగా ప్రస్తుతం తమకున్న స్కిల్స్ పాతపడిపోతాయని, తద్వారా భవిష్యత్తులో తమ ఉద్యోగాలు ప్రభావితం అవుతాయని దేశీయంగా సగానికి పైగా ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సోమవారం గ్లోబల్ లేబర్ మార్కెట్ కాన్ఫరెన్స్(జీఎల్ఎంసీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం, 55 శాతం మంది ప్రొఫెషనల్ ఉద్యోగులు తమ స్కిల్స్ వచ్చే ఐదేళ్లలో పాక్షికంగా లేదా పూర్తిగా అవసరం లేకుండా పోవచ్చని, దీన్ని అధిగమించేందుకు రీస్కిల్లింగ్ అవసరమని భావిస్తున్నారు. అడ్వాన్స్ స్కిల్స్ ఉన్న వారి సంఖ్య దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా తక్కువగానే ఉంది. జీఎల్ఎంసీ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న భారత ప్రొఫెషనల్స్‌లో దాదాపు 40 శాతం మంది కొత్త స్కిల్స్ నేర్చుకునేందుకు సమయం, ఆర్థిక ఇబ్బందులు ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయని చెబుతున్నారు. అలాగే, 70 శాతం మంది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ)లో పోటీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా కొత్త స్కిల్స్ కోసం మౌలిక సదుపాయాలను అందించడంలో ప్రభుత్వాలపై ఉద్యోగులకు విశ్వాసం కూడా తక్కువగానే ఉన్నట్టు సర్వేలో తేలింది. భారత్‌లో 31 శాతం, సౌదీ అరేబియాలో 35 శాతం, అమెరికాలో 15 శాతం, యూకేలో 12 శాతం మందికి ప్రభుత్వాలపై తక్కువ విశ్వాసం ఉన్నట్టు అభిప్రాయం వ్యక్తం చేశారు.






