- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mahila Samridhi Yojana: ఉమెన్స్ డే వేళా మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ. 2500 ఇవ్వనున్న సర్కార్..పూర్తి వివరాలివే
Mahila Samridhi Yojana: మహిళా దినోత్సవం(Womens day 2025) సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా(rekha guptha) శుభవార్త అందించారు.

దిశ, వెబ్ డెస్క్: Mahila Samridhi Yojana: మహిళా దినోత్సవం(Womens day 2025) సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా(rekha guptha) శుభవార్త అందించారు. నెలకు రూ. 2500 ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే మహిళా సమృద్ధి యోజన స్కీము(Mahila Samridhi Yojana)ను అమలు చేస్తామని వెల్లడించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం(Womens day 2025) సందర్భంగా ఢిల్లీ మహిళలకు శుభవార్త వినిపించారు ముఖ్యమంత్రి రేఖా గుప్తా(rekha guptha). పేద మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సహాయం అందించేందుకు మహిళా సమృద్ధి యోజన స్కీము(Mahila Samridhi Yojana)ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు సీఎం తెలిపారు. శనివారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఈ స్కీముకు ఆమోదం లభించిందని తెలిపారు. ఈ స్కీం కోసం బడ్జెట్లో రూ. 5,100 కోట్లు కేటాయించినట్లు సీఎం పేర్కొన్నారు. మహిళా సమృద్ధి యోజన(Mahila Samridhi Yojana) అమలు కోసం తన ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు అయినట్లు రేఖా గుప్తా తెలిపారు. ఈ కమిటీలో సీనియర్ మంత్రులు అశిశ్ సూద్, పర్వేశ్ వర్మ, కపిల్ మిశ్ర ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ అవుతుందని, వెబ్ పోర్టల్ కూడా లాంచ్ చేస్తామని సీఎం తెలిపారు.
పేద మహిళలకు ప్రతినెల రూ. 2500 ఆర్థిక సాయం అందిస్తామని ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన రూ. 2,100కంటే ఎక్కువ ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. ప్రచారంలో దీన్ని కీలక అస్త్రంగా మార్చుకుంది బీజేపీ. దీంతోపాటు ఇతర హామీలు కూడా బీజేపీకి కలిసి వచ్చాయి. మొత్తానికి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది కమలదళం. ఈ విషయమై ఢిల్లీ మహిళలకు అభినందనలు తెలిపారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్రమంత్రి జేపి నడ్డా. మహిళా సమృద్ధి యోజన పథకాన్ని(Mahila Samridhi Yojana) త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ స్కీములో ఢిల్లీలో మహిళా సాధికారత కోసం అడుగులు పడినట్లు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంలో మహిళలదే పై చేయి అన్నారు.
రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది.. ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో?
మహిళా సమృద్ధి యోజన(Mahila Samridhi Yojana)లో నమోదు చేసుకోవడానికి నేమొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉంటుందని అధికారులు తెలిపారు. మహిళా సమృద్ధి యోజన కోసం ప్రత్యేక వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను ప్రారంభించవచ్చనున్నట్లు వెల్లడించారు.
మహిళా సమృద్ధి యోజన(Mahila Samridhi Yojana)కు అర్హత ఏమిటి?
- ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారు మహిళ ఢిల్లీ పౌరురాలై ఉండాలి.
- ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో పదవీ విరమణ చేసిన లేదా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కాకూడదు.
- మహిళా సమృద్ధి యోజన పేద మహిళల కోసమేనని బిజెపి ఇప్పటికే స్పష్టం చేసింది.
- ఆ మహిళ దారిద్య్రరేఖకు దిగువన (BPL) లేదా EWS కేటగిరీ కిందకు రావాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షల నుండి 3 లక్షల వరకు ఉండాలి.
- స్త్రీ వయస్సు 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఆ మహిళ ఇప్పటికే మరే ఇతర పథకం ప్రయోజనాన్ని పొందకూడదు.
ఏ పత్రాలు అవసరం?
- మహిళా సమృద్ధి యోజన(Mahila Samridhi Yojana)కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది పత్రాలు అవసరం.
- ఆధార్ కార్డు
- ఢిల్లీ నివాసిగా ధృవీకరించే సర్టిఫికేట్
- బిపిఎల్ కార్డ్
- ఆధార్ కార్డుకు లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నంబర్
- ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్
- ఆదాయ ధృవీకరణ పత్రం
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో
- కుల ధృవీకరణ పత్రం
Read Also..
Womens Day 2025: మీ కాళ్ళ పై మీరు నిలబడండి.. మహిళల కోసం టాప్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్






