Womens Day 2025: మీ కాళ్ళ పై మీరు నిలబడండి.. మహిళల కోసం టాప్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్

by Vennela |   (  Updated:2025-03-08 06:10:16  IST  )

Womens Day 2025: మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో మహిళలకు ఆర్థిక అక్షరాస్యత, స్వాతంత్ర్యం ప్రాముఖ్యతపై మరింత ఫోకస్ పెట్టేందుకు ఇదే సరైన సమయం.

Womens Day 2025: మీ కాళ్ళ పై మీరు నిలబడండి.. మహిళల కోసం టాప్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: Womens Day 2025: మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో మహిళలకు ఆర్థిక అక్షరాస్యత, స్వాతంత్ర్యం ప్రాముఖ్యతపై మరింత ఫోకస్ పెట్టేందుకు ఇదే సరైన సమయం. ఎప్పుడు జరుపుకునే వేడుకలకు అతీతంగా మహిళలు ఈసారి తమ ఆర్థిక స్వావలంబన సాధించే చర్యలపై ఫోకస్ పెట్టాలి. స్థిరమైన భవిష్యత్తులను పొందడానికి ఆర్థిక అక్షరాస్యత, వ్యూహాత్మక పెట్టుబడులు అనేవి కీలకం. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ వంటి డైనమిక్ ప్రపంచం నుంచి బంగారం, రియల్ ఎస్టేట్ వంటి కాలాతీత ఆకర్షణ, ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాల భద్రత వరకు, మహిళలు పెట్టుబడి పెట్టేందుకు ఉన్న ఉత్తమమైన ఆప్షన్స్ చూద్దాం.

1.మ్యూచువల్ ఫండ్స్

మ్యూచువల్ ఫండ్స్ వృద్ధి సామర్థ్యం, వైవిధ్యత ఈ రెండింటినీ అందిస్తాయి. సిప్ రెగ్యులర్ చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతిస్తాయి. ఇవి విస్త్రుత శ్రేణి పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటాయి.

2. స్టాక్స్

అధిక రిస్క్ టాలరెన్స్ ఉన్నవారికి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రాబడి లభిస్తుంది. అయితే దీనికి సమగ్ర పరిశోధన, మార్కెట్ పై అవగాహన కలిగి ఉండటం అనేది ముఖ్యం.

3. బంగారం

మహిళలు ఎక్కువగా ఇష్టపడే సాంప్రదాయ పెట్టుబడి బంగారం వారి పోర్ట్ పోలియోను వైవిధ్యపరచాలనుకునేవారికి గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ అనేది ఒక అద్బుతమైన ఆప్షన్. మహిళలు బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

-గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్

-గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్

-డిజిటల్ గోల్డ్

బంగారు ఆభరణాలను పెట్టుబడిగా పరిగణించకూడదు. కటింగ్స్, ట్యాక్స్ వంటి చాలా ఖర్చులు ఇందుకు కారణం.

4. రియల్ ఎస్టేట్

గణనీయమైన రాబడిని అందించే దీర్ఘకాలిక పెట్టుబడి రియల్ ఎస్టేట్. ఇది ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది.

5. ఆర్ఈఐటీ

ప్రత్యక్షంగా ప్రాపర్టీలను మేనేజ్ చేసే అవసరం లేకుండా, ప్రముఖ ఆఫీస్ కార్యాలయాలు, మాల్స్, హోటల్స్ వంటి కమర్షియల్ ప్రాపర్టీల నుంచి ఆదాయాన్ని జనరేట్ చేయగలిగేవే ఈ ఆర్ఈఐటీలు.

ఈ డొమైన్ లో భారత్ లో రెండు లిస్టెట్ ఆర్ఈఐటీలు ఉన్నాయి. ఎంబసీ ఆఫీస్ పార్క్స్, మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్. అద్దె, ఆదాయం, మూలధన పెరుగుదల ద్వారా 80శాతం నుంచి 10శాతం వార్షిక రాబడిని అందిస్తుంటాయి. రిస్క్ కు తగ్గ రాబడిని తూకం వేసే మహిళలకు, స్థిరమైన ఆదాయాన్నినిర్మించడానికి ఆర్ఈఐటీలు మంచి మార్గం.

6. ఫిక్స్డ్ డిపాజిట్లు

బ్యాంక్ ఎఫ్డీలు గ్యారెంటీ రాబడిని కోరుకునేవారికి సురక్షితమైన నమ్మదగిన ఆప్షన్స్ ఉన్నాయి.

7. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్

ఈ ప్రభుత్వ స్కీమ్ డిపాజిట్లపై స్థిర వడ్డీ రేటును అందిస్తుంది. ఇది మహిళలకు సురక్షితమైన పెట్టుబడి మార్గాన్ని అందిస్తుంది.

8. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్

పీపీఎఫ్ అనేది పన్ను ప్రయోజనాలతో కూడిన దీర్ఘకాలిక, తక్కువ రిస్క్ పెట్టుబడి. ఇది రిటైర్మెంట్ ప్లాన్ కు సరైంది.

Read More : Best savings schemes for women: భార్య పేరు మీద రూ.1,00,000 డిపాజిట్ చేస్తే.. ఎంత రిటర్న్ వస్తుందో తెలుసా?

Read More : Financial Planning: ప్రతి ఏటా లక్షన్నర ఆదా చేసుకునే అవకాశం.. మీ పిల్లల భవిష్యత్ కోసం ఇలా చేయండి

Next Story