- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIG Shock: భారీగా పెరిగిన బంగారం ధర.. తొలిసారి లక్ష దాటిన 22క్యారెట్ల గోల్డ్
by Naga Rani Yarlagadda |
బంగారం కొనుగోలుదారులకు బిగ్ షాక్ తగిలింది. భారీగా ధర పెరగడంతో 22 క్యారెట్ల బంగారం సైతం తొలిసారి లక్ష రూపాయలు దాటింది.

X
దిశ, వెబ్‌డెస్క్: కొనుగోలు దారులకు బంగారం ధరలు (Today Gold Rates) కోలుకోలేని షాకిచ్చాయి. ఊహించని రీతిలో భారీగా బంగారం ధరలు పెరగడంతో తొలిసారి 22 క్యారెట్ల బంగారం ధర సైతం లక్షరూపాయల మార్కును దాటింది. మంగళవారం బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం.. 10 గ్రాముల ధర రూ.1360 పెరిగి రూ.1,10,290కి చేరుకుంది.
22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1250 పెరిగి రూ.1,01,100కు ఎగబాకింది. దీంతో బంగారం కొనుగోలు దారులకు ఊహించని షాక్ తగిలినట్లయింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు కిలో వెండి ధర రూ.1,40,000గా ఉంది. రాబోయేది పెళ్లిళ్లు, పండుగల సీజన్ కావడంతో బంగారం, వెండి ధరలను చూసి కొనుగోలుదారులు ఖంగుతింటున్నారు.
Next Story






