Bajaj Dominar 400: బజాజ్ నుంచి కొత్త బైక్స్.. ఫీచర్స్, ధర వివరాలు ఇవే!

by velandi.Saikiran |

బజాజ్ ఆటో కంపెనీకి (Bajaj Auto Company) ఇండియా వ్యాప్తంగా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా బజాజ్ కు

Bajaj Dominar 400: బజాజ్ నుంచి కొత్త బైక్స్.. ఫీచర్స్, ధర వివరాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: బజాజ్ ఆటో కంపెనీకి (Bajaj Auto Company) ఇండియా వ్యాప్తంగా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా బజాజ్ కు సంబంధించిన వాహనాలు చాలా మంది వాడుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ కంపెనీ నుంచి రెండు ద్విచక్ర వాహనాలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. 2025 డామినర్ 400 (2025 Bajaj Dominar 400 ) అలాగే డామినర్ 250 ( Dominar 250) పేరుతో రెండు స్పోర్ట్స్ బైక్ మోడల్ ను లాంచ్ చేసింది కంపెనీ.

ధర వివరాల విషయానికి వస్తే... వాస్తవంగా బజాజ్ నుంచి వచ్చిన ఎలాంటి వాహనాలైనా తక్కువ ధరకే లభిస్తాయి. లేటెస్ట్ గా విడుదలైన ఈ రెండు బైకుల ధరలు కూడా.. సాధారణంగానే ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. మొదటగా డామినర్ 250 వేరియంట్ బైక్ ధర 1.92 లక్షలు గా ఉంది. అలాగే డామినర్ 400 మోడల్ బైక్ ధర రూ. 2.39 లక్షలు గా ఫిక్స్ చేశారు. ఈ రెండు బైక్స్ ధర.. ఎక్స్ షోరూం ప్రకారమే ఉంటుంది. తాజాగా రిలీజ్ అయిన ఈ రెండు బైక్ లలో నాలుగు రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. స్పోర్ట్స్, ఆఫ్ రోడ్, రైన్ అలాగే రోడ్ మోడ్స్ ఉన్నాయి. పల్సర్ ఎన్ఎస్ 400 Z తరహాలోనే ఈ రెండు బైక్ లకు డిజిటల్ డిస్ప్లే అందిస్తున్నారు.

Next Story