Nissan : నిస్సాన్ నుంచి 20 వేలమంది ఉద్యోగుల ఔట్

by Muthe.Rajitha |

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్(Nissan) భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపనుంది.

Nissan : నిస్సాన్ నుంచి 20 వేలమంది ఉద్యోగుల ఔట్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్(Nissan) భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపనుంది. ఈ జపనీస్ కార్ల తయారీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 20 వేల మంది ఉద్యోగులకు లే ఆఫ్(Lay Off) ప్రకటించింది. 2024-25లో కార్ల అమ్మకాలు క్షీణించడం(Sales Drop), భారీగా నష్టాలు పెరగడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. వర్క్ ఫోర్స్ లో ఈ సంఖ్య 15% అని తెలిపింది. కాగా గత నవంబర్లో 94% కార్ల అమ్మకాలు క్షీణించడంతో అప్పట్లోనే 9 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇపుడు అంతకు రెట్టింపు సంఖ్యలో ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించడం సంచలనం రేపింది.

గత ఆర్థిక సంవత్సరంలో 750 బిలియన్ యెన్స్ ల రికార్డు స్థాయి నష్టాలను కంపెనీ చవిచూసింది. కంపెనీకి ఈ విపత్కర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపింది. ఇక కంపెనీలో 18 ఏళ్ల సర్వీసు నిండిన వారికి ముందస్తు పదవీ విరమణ ప్రకటించనున్నట్టు సమాచారం. నిస్సాన్ తమ వార్షిక ఫలితాలను రేపు ప్రకటించే అవకాశం ఉండగా.. ఈలోపు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Next Story