- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Startups: దేశంలో 73కి చేరిన యూనికార్న్ కంపెనీలు
యూనికార్న్‌ల పరంగా మనదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా ఉన్నట్టు తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాదిలో దేశంలో కొత్తగా యూనికార్న్ క్లబ్‌లో 11 స్టార్టప్‌లు చేరాయని హురున్ ఇండియా గురువారం ప్రకటనలో వెల్లడించింది. దీంతో మొత్తం యూనికార్న్‌ల సంఖ్య 73కి చేరాయని, తద్వారా యూనికార్న్‌ల పరంగా మనదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా ఉన్నట్టు తెలిపింది. ఈ ఏడాది ఇప్పటివరకు జాబితాలో చేరిన కొత్త కంపెనీలలో నవీ టెక్నాలజీస్, ఏఐ.టెక్, డార్విన్‌బాక్స్, నెట్‌రాడిన్, రాపిడో, జంబోటైల్ వంటి ప్రముఖ స్టార్టప్‌లు ఉన్నాయి. వాల్యుయేషన్ పరంగా దేశంలోని యూనికార్న్‌లలో స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ సంస్థ జెరోధా 8.2 బిలియన్ డాలర్ల(రూ. 72.40 వేల కోట్ల)తో ముందంజలో ఉంది. తర్వాత రేజర్‌పే, లెన్స్‌కార్ట్ ఒక్కొక్కటి రూ. 66.22 వేల కోట్లతో, అతిపెద్ద బ్రోకరేజ్ సంస్థ గ్రో రూ. 62 వేల కోట్ల విలువను కలిగి ఉన్నాయని హురున్ ఇండియా నివేదికలో పేర్కొంది. టాప్ 10 జాబితాలో ఉన్న వాటిలో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో, బీ2బీ ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్ మార్కెట్‌ప్లేస్ ఆఫ్‌బిజినెస్, మొబైల్ యాడ్స్ సంస్థ ఇన్మోబి యాడ్‌టెక్, సాస్ ప్లేయర్ ఐసెర్టిస్, హోటల్ అగ్రిగేటర్ ఓయో, డెలివరీ ప్లాట్‌ఫామ్ మీషో ఉన్నాయి. టాప్‌లో ఉన్న ఈ కంపెనీలు మొత్తం 2.06 లక్షల మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నాయి. ముఖ్యంగా లెన్స్‌కార్ట్, ఆఫ్‌బిజినెస్, ఫిజిక్స్‌వాలా ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని నివేదిక పేర్కొంది.






