- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AI: దేశంలో ప్రతి 10 ఓపెన్ జెన్ఏఐ ఉద్యోగాలకు ఒక్కరే ఇంజనీర్
ప్రతి 10 ఓపెన్ జెన్ఏఐ ఉద్యోగాలకు ఒకే ఒక్క అర్హత కలిగిన ఇంజనీర్ ఉన్నారని, ఇది అతిపెద్ద స్కిల్ గ్యాప్ అని పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత కృత్రిమ మేధ(ఏఐ) మార్కెట్ 28.8 బిలియన్ డాలర్ల(రూ. 2.53 లక్షల కోట్ల)తో హైపర్-గ్రోత్ దశలో ఉందని టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక వెల్లడించింది. కానీ, అందుకు తగిన స్థాయిలో స్కిల్స్ ఉన్న ఉద్యోగల కొరత కూడా ఉందని నివేదిక గురువారం ప్రకటనలో తెలిపింది. దేశంలో ప్రతి 10 ఓపెన్ జెన్ఏఐ ఉద్యోగాలకు ఒకే ఒక్క అర్హత కలిగిన ఇంజనీర్ అందుబాటులో ఉన్నారని, ఇది అతిపెద్ద స్కిల్ గ్యాప్ అని పేర్కొంది. ప్రస్తుతం ఏఐ రంగంలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఎల్ఎల్ఎం సేఫ్టీ అండ్ ట్యూనింగ్, ఏఐ ఆర్కెస్ట్రేషన్, ఏజెంట్ డిజైన్, సిమ్యూలేషన్ గవర్నెన్స్, ఏఐ కంప్లయన్స్ అండ్ రిస్క్ ఆపరేషన్స్ ఉద్యోగాలకు అత్యధిక డిమాండ్ ఉంది.
ముఖ్యంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో(జీసీసీ) జనరేటివ్ ఏఐ ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్(ఎంఎల్) ఆపరేషన్స్ ఉద్యోగాలు ఏఐ రంగంలో కొత్త బెంచ్‌మార్క్‌గా మారుతునాయి. ఈ ఉద్యోగాల్లో సీనియర్లకు ఏడాదికి రూ. 60 లక్షల వరకు ఆఫర్లు లభిస్తుండటం గమనార్హం. 2025-2027 మధ్య సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలకు రూ. 34 లక్షలు, డేటా ఇంజనీర్లకు రూ. 27 లక్షల వరకు జీతాల పెరుగుదల ఉంటుందని నివేదిక అంచనా వేసింది.
నివేదిక ప్రకారం, దేశ ఏఐ మార్కెట్ హైపర్-గ్రోత్ దశలోకి ప్రవేశిస్తోంది, 2025లో 45 శాతం స్కిల్ గ్యాప్ వృద్ధితో రూ. 2.53 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. తీవ్రమైన స్కిల్ గ్యాప్ మధ్యే ఈ వృద్ధి నమోదైంది. 2026 నాటికి ఏఐ స్కిల్ గ్యాప్ 53 శాతానికి చేరుకుంటుందని అంచనా వేయగా, క్లౌడ్ కంప్యూటింగ్ 55-60 శాతం డిమాండ్-సరఫరాలో అంతరం ఉంటుందని నివేదిక అంచనా వేసింది. ఏఐ వినియోగం మొత్తం జాబ్ మార్కెట్‌ను మార్చివేయగలదని నివేదిక తెలిపింది. ముఖ్యంగా ఐటీ సేవలు, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్, బీఎఫ్ఎస్ఐ, హెల్త్‌కేర్ రంగాల్లో 40 శాతం మేర ప్రభావితం చేయవచ్చు. ప్రధానంగా జీసీసీల్లో నియామకాలు మరింత వేగవంతం కానున్నాయి. టైర్-2, టైర్-3 ఇంజనీరింగ్ క్యాంపస్‌లలో ఇది మరింత ఎక్కువ. అలాగే, టాప్-20 జీసీసీల్లో 40 శాతం మహిళలు ఉన్నారు. ఇది పరిశ్రమ సగటు కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువని నివేదిక పేర్కొంది.






