- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెన్నైలో వ్యాపారి కుటుంబంపై కాల్పులు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాజధాని ప్రాంతమైన చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. పారిస్ కార్నర్‌లోని షావుకారుపేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని గుర్తుతెలియని దుండగులు విచక్షణా రహితంగా కాల్చిచంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకివెళితే.. షావుకారుపేటలో దలీల్ చంద్ అనే ఫైనాన్స్ వ్యాపారి కుటుంబం నివాసముంటోంది. అయితే, బుధవారం ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు వ్యాపారి కుటుంబాన్ని తుపాకితో కాల్చిచంపారు. కాల్పుల్లో వ్యాపారి దలీల్ చంద్ (74), […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాజధాని ప్రాంతమైన చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. పారిస్ కార్నర్‌లోని షావుకారుపేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని గుర్తుతెలియని దుండగులు విచక్షణా రహితంగా కాల్చిచంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు.
వివరాల్లోకివెళితే.. షావుకారుపేటలో దలీల్ చంద్ అనే ఫైనాన్స్ వ్యాపారి కుటుంబం నివాసముంటోంది. అయితే, బుధవారం ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు వ్యాపారి కుటుంబాన్ని తుపాకితో కాల్చిచంపారు. కాల్పుల్లో వ్యాపారి దలీల్ చంద్ (74), ఆయన భార్య కుషాల్ భాయ్ (70), కుమారుడు సీతర్ (38) అక్కడికక్కడే మృతి చెందారు. అయితే, ఈ దాడికి ఆర్థిక లావాదేవీలే కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.






