- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రకాశంలో ఆర్టీసీ బస్సు బోల్తా
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం గ్రామ సమీపంలోని నేషనల్ హైవే పై శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్లా ఉరవకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మార్కాపురం నుండి వెళ్తూ తిప్పాయపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. సిమెంటు ట్యాంకర్ లారీ ని ఓవర్టేక్ చేసి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు చివరిభాగంలో లారీ తగలడంతో ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు అదుపు […]</p>

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం గ్రామ సమీపంలోని నేషనల్ హైవే పై శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్లా ఉరవకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మార్కాపురం నుండి వెళ్తూ తిప్పాయపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది.

సిమెంటు ట్యాంకర్ లారీ ని ఓవర్టేక్ చేసి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు చివరిభాగంలో లారీ తగలడంతో ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సు పక్కకి వాలుతున్న సమయంలో అందులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు లారీ కూడా అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది.
సమాచారం తెలుసుకున్న మార్కాపూర్ రూరల్ ఎస్ఐ కోటయ్య తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులకు మరొక బస్సు ఏర్పాటు చేసి వారి పట్టణాలకు పంపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.






