- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో ఘోర బస్సు ప్రమాదం
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం, పెనుగొండ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. వరహానది ఒడ్డున బ్రిడ్జి పైనుండి 14 అడుగుల లోతులో బస్సు పడిపోయింది. చెన్నై నుండి విశాఖ వెళుతుండగా అదుపు తప్పిన బస్సు నదిలో పడినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులోని ప్రయాణికుల కోసం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం, పెనుగొండ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. వరహానది ఒడ్డున బ్రిడ్జి పైనుండి 14 అడుగుల లోతులో బస్సు పడిపోయింది. చెన్నై నుండి విశాఖ వెళుతుండగా అదుపు తప్పిన బస్సు నదిలో పడినట్టు తెలుస్తోంది.
ప్రమాద సమయంలో బస్సులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులోని ప్రయాణికుల కోసం గాలింపు ప్రారంభించినట్టు తెలిపారు అధికారులు. బస్సు పూర్తిగా ధ్వంసం అయినట్టు పోలీసులు వెల్లడించారు.
Next Story






