చలి కాలం ఎఫెక్ట్.. దోమల కోసం కాయిల్స్ వెలిగిస్తున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా?

by  |

దిశ, వెబ్‌డెస్క్ : దోమల వలన అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఇక దోమలు ఇంటిలోపలికి వచ్చాయంటే అంతే సంగతి. ఎవరిని మనశ్శాంతిగా ఉండనివ్వవు, ఎందుకంటే వాటికి ఆహారం మన రక్తం కాబట్టి. అంతే కాకుండా చలికాలంలో దోమల దండయాత్ర మాములుగా ఉండదు. ఎప్పుడెప్పుడు కాటు వేద్దామా అన్నట్టు చూస్తూ ఉంటాయి. ఇక వీటివలన మలేరియా, డెంగ్యూ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే చాలా మంది ఇంటిలోకి వచ్చిన దోమలను చంపడానికి, లేక వాటిని బయటకు పంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు నిద్రలో దోమలు కుట్టకుండా ఉండేందుకు చాలామంది ఇప్పటికీ మస్కిటో కాయిల్స్ కాలుస్తుంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు వైద్య నిపుణులు. దోమలను తరిమి కొట్టడానికి కాల్చే కాయిల్స్ కాల్చడం వలన అనేక ఆరోగ్య సమస్యలు మన కుటుంబ సభ్యులలో కలుగుతాయి. ఎందుకంటే వీటిలో ఉండే రసాయనాలు అంలాంటివి. మనం కాయిల్ పొగను ఎక్కువసేపు పీల్చుకుంటే.. ఆస్తమా వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ఈ పొగ పిల్లల శ్వాసపై కూడా చెడు ప్రభావాన్ని చూపడంతోపాటు.. అనారోగ్యాన్ని కలిగిస్తుంది. కళ్ళు, చర్మంపై కూడా దీని ప్రమాదం అధికంగా ఉంటోంది. అందువలన దోమలను బయటకు తరమడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలి తప్ప ఇలా కాయిల్స్ వెలిగిస్తూ అనారోగ్య సమస్యలకు గురి కాకుడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పటికైనా వాటిని దూరం పెట్టకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు.

Next Story