మీరాబాయికి బంపర్ చాన్స్.. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ వచ్చే అవకాశం..

by  |
mirabai chanu
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కల్లోలంలో అసలు ఒలింపిక్స్ జరుగుతాయా.. అనే ప్రశ్న అందరి మదిలో మెదిలింది. అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టోక్యో ఒలింపిక్స్ 2020 వెయిట్‌ లిఫ్టింగ్ పోటీల్లో, భారత స్టార్ అథ్లెట్ మీరాబాయి చాను 49 కిలోల విభాగంలో సిల్వర్ పతాకాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పడు మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్ దక్కే అవకాశం ఉంది.

అదేలాగంటే.. 49 కిలోల విభాగంలో మీరాబాయితో పోటీపడి గోల్డ్ మెడల్ సాధించిన చైనా అథ్లెట్ జిహుయి హు డోపింగ్‌ కు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చైనాకు చెందిన అథ్లెట్ జిహుయి హు ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా హేమస్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, యూఎస్ పౌరుడు కైల్ బాస్ ఓ పోస్ట్ చేశారు. దీంతో ఈ డోపింగ్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకవేళ డోపింగ్ పరీక్షలో చైనా అథ్లెట్ విఫలమైతే ఇండియా ఖాతాలో గోల్డ్ మెడల్ పడడం ఖాయం.


Next Story

Most Viewed