బీజేపీ నాయకులను కిందపడేసిన ఎడ్లు.. నిరసనలో ఎంతపనాయే..!

by Sridhar Babu |   (  Updated:2021-11-30 10:23:50  IST  )

<p>దిశ, సిరిసిల్ల: పెట్రోలియంపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిరిసిల్లలో కూడా మంగళవారం కమల నాథులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎద్దుల బండిని ఆందోళనలో ప్రదర్శిస్తూ వ్యాట్ తగ్గించకపోతే వీటిపైనే ఆధారపడాల్సి ఉంటుందన్న సంకేతాలను ఇచ్చారు. ఈ క్రమంలో ఎద్దుల బండితో ఆర్డీవో కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వైపు వస్తుండగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా సాగుతున్న సమయంలో.. ఒక్కసారిగా [&hellip;]</p>

బీజేపీ నాయకులను కిందపడేసిన ఎడ్లు.. నిరసనలో ఎంతపనాయే..!
X

దిశ, సిరిసిల్ల: పెట్రోలియంపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిరిసిల్లలో కూడా మంగళవారం కమల నాథులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎద్దుల బండిని ఆందోళనలో ప్రదర్శిస్తూ వ్యాట్ తగ్గించకపోతే వీటిపైనే ఆధారపడాల్సి ఉంటుందన్న సంకేతాలను ఇచ్చారు. ఈ క్రమంలో ఎద్దుల బండితో ఆర్డీవో కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వైపు వస్తుండగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా సాగుతున్న సమయంలో.. ఒక్కసారిగా ఎద్దులు బెదిరి పరుగులు తీశాయి.

దీంతో బండిపై ఉన్న బీజేపీ పట్టణ అధ్యక్షుడు అన్నల్ దాస్ వేణు, మేకల కమలాకర్‌తో పాటు పలువురు కార్యకర్తలు కింద పడి గాయపడ్డారు. ఒక్కసారిగా ఎద్దులు బండిని వేగంగా లాక్కెళ్లడంతో తహశీల్దార్ కార్యాలయం వద్ద భయానక వాతావరణం చోటుచేసుకుంది. బండితో సహా పరుగులు పెట్టిన ఎద్దులు.. టౌన్ క్లబ్ వెనుక వైపు దూసుకెళ్లాయి. ఓ వాహనదారుడిని ఢీ కొట్టడంతో బాధితుడు స్వల్పంగా గాయపడ్డాడు. కొంతదూరం దూసుకెళ్లిన ఎద్దులు ఎట్టకేలకు శాంతించడంతో అందరూ ఊపీరి పీల్చుకున్నారు.

Next Story