- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరుదైన నాణేలను సేకరిస్తున్న బీటెక్ విద్యార్థి..
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రాచీన కాలపు, అరుదైన నాణేలను సేకరిస్తూ బీటెక్ విద్యార్థి వార్తల్లో నిలుస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు గ్రామానికి చెందిన కోడంరి నాగ సూర్య రాఘవేంద్ర బాబు.. తాడేపల్లిలోని శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. ఇదే సమయంలో పత్రికల్లో, టీవీల్లో వస్తోన్న అరుదైన నాణేలను చూసి ఆకర్షితుడయ్యాడు. ఇదే క్రమంలో సుమారు 60-70 అరుదైన నాణేలను సేకరించాడు. వేయ్యేల్ల కిందటి తంజావూరు నుంచి మొదలుపెడితే ఇలా ఎన్నో […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ప్రాచీన కాలపు, అరుదైన నాణేలను సేకరిస్తూ బీటెక్ విద్యార్థి వార్తల్లో నిలుస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు గ్రామానికి చెందిన కోడంరి నాగ సూర్య రాఘవేంద్ర బాబు.. తాడేపల్లిలోని శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. ఇదే సమయంలో పత్రికల్లో, టీవీల్లో వస్తోన్న అరుదైన నాణేలను చూసి ఆకర్షితుడయ్యాడు. ఇదే క్రమంలో సుమారు 60-70 అరుదైన నాణేలను సేకరించాడు. వేయ్యేల్ల కిందటి తంజావూరు నుంచి మొదలుపెడితే ఇలా ఎన్నో నాణేలను సమకూర్చాడు. వీటిని ఎన్నోసార్లు అనేక కార్యక్రమాలు నిర్వహించి అరుదైన నాణేలను ప్రదర్శించాడు. ఇందుకు గాను ఏకంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి నుంచి మొదలుపెడితే.. మంత్రులు, అధికారుల ప్రశంసలు పొందాడు. దీనికి తోడు 200లకు పైగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్ధూ దినపత్రికలు కోడంరి నాగ సూర్య రాఘవేంద్ర బాబు టాలెంట్‌ను గుర్తించి ప్రచురించాయి. దీనికిగాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేయడం గమనార్హం. ఏనాటికైనా శాసన మండలిలో సభ్యుడిగా కావాలన్నది తన ఆశయమంటూ కోడంరి నాగ సూర్య లక్ష్యాన్ని పెట్టుకున్నారు.






