- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు హత్యకు జగన్ కుట్ర.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
<p>దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును హత్య చేసేందుకు సీఎం వైఎస్ జగన్ కుట్ర పన్నుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. సోమవారం మీడియాతో మాట్లాడిన బీటెక్ రవి.. అరెస్ట్‌ల పేరుతో చంద్రబాబును హాస్పిటల్స్ చుట్టూ తిప్పి కరోనా తగిలించి చంపేయాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. దీనికి గాను జగన్‌పై 120బి, 307 సెక్షన్లు కింద […]</p>

దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును హత్య చేసేందుకు సీఎం వైఎస్ జగన్ కుట్ర పన్నుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. సోమవారం మీడియాతో మాట్లాడిన బీటెక్ రవి.. అరెస్ట్‌ల పేరుతో చంద్రబాబును హాస్పిటల్స్ చుట్టూ తిప్పి కరోనా తగిలించి చంపేయాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు.
దీనికి గాను జగన్‌పై 120బి, 307 సెక్షన్లు కింద కేసు పెట్టాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు. కరోనాపై మాట్లాడినందుకు చంద్రబాబుపై కేసు పెట్టడం దారుణమని విమర్శించారు. అటు కరోనాపై దుష్ప్రచారం చేశారనే ఆరోపణలతో చంద్రబాబుపై కర్నూలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ బయల్దేరిన కర్నూలు పోలీసులు.. చివరికి నోటీసులు ఇవ్వకుండానే వెనక్కి వెళ్లిపోయారు.






