- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలువలు తవ్వి రైతులను మోసం చేశారు : RSP
by Chintha Aamani |
<p>దిశ, బెజ్జూర్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాలువలు తవ్వి రైతులను మోసం చేశారని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం బెజ్జూర్ మండలంలోని పోతపల్లి గ్రామ సమీపంలో ఉన్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాలువలను ఆయన పరిశీలించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల రైతులకు […]</p>

X
దిశ, బెజ్జూర్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాలువలు తవ్వి రైతులను మోసం చేశారని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం బెజ్జూర్ మండలంలోని పోతపల్లి గ్రామ సమీపంలో ఉన్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాలువలను ఆయన పరిశీలించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదని, ఈ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మించకుండా కాళేశ్వరంలో ప్రాజెక్టు నిర్మించారని విమర్శించారు. ఆర్ఎస్‌పీ వెంట బీఎస్పీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి హర్షత్ హుస్సేన్ ఉన్నారు.
Next Story






