యూపీలో కలకలం.. బీఎస్పీ నేత సూసైడ్!

by Batti.Sumithra |

<p>దిశ, వెబ్‌‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేగింది. బదాయూ సమీపంలోని తహసీల్‌లో బీఎస్పీ నేత హర్‌వీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన స్థలాన్ని క్రమబద్దీకరించాలని దరఖాస్తు చేసుకున్న అతను.. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోక పోవడంతో ఇటీవల పై అధికారితో గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో సోమవారం హర్‌వీర్‌ను విచారణకు రావాలని అధికారులు కోరడంతో మనస్థాపానికి గురై విషాహారం తీసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే ప్రాణాలు కోల్పోయాడు. బదాయూ జిల్లా పరిధిలోని సహస్వాన్ నియోజకవర్గంలో [&hellip;]</p>

యూపీలో కలకలం.. బీఎస్పీ నేత సూసైడ్!
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేగింది. బదాయూ సమీపంలోని తహసీల్‌లో బీఎస్పీ నేత హర్‌వీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన స్థలాన్ని క్రమబద్దీకరించాలని దరఖాస్తు చేసుకున్న అతను.. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోక పోవడంతో ఇటీవల పై అధికారితో గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో సోమవారం హర్‌వీర్‌ను విచారణకు రావాలని అధికారులు కోరడంతో మనస్థాపానికి గురై విషాహారం తీసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే ప్రాణాలు కోల్పోయాడు. బదాయూ జిల్లా పరిధిలోని సహస్వాన్ నియోజకవర్గంలో పదేళ్ల క్రితం భూమిని కొనుగోలు చేయగా దానిపైనే గొడవ జరుగుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story