- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాదాద్రిలో దారుణ హత్య.. ఆ ప్లేస్‌లోనే గొడ్డలితో నరికి..!
<p>దిశ ప్రతినిధి, నల్లగొండ : యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూతగాదాలు, పాత కక్షల నేపథ్యంలో గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. వొలిగొండ మండలం పహిల్వాన్ పురం గ్రామానికి చెందిన ఎలిమినేటి వెంకట్‌ను సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపారు. మృతుడు వెంకట్ రెడ్డి గతంలో పహిల్వాన్ పురం గ్రామానికి చెందిన సంజీవ రెడ్డి అనే వ్యక్తిని హతమార్చిన విషయంలో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. […]</p>

దిశ ప్రతినిధి, నల్లగొండ : యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూతగాదాలు, పాత కక్షల నేపథ్యంలో గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. వొలిగొండ మండలం పహిల్వాన్ పురం గ్రామానికి చెందిన ఎలిమినేటి వెంకట్‌ను సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపారు.
మృతుడు వెంకట్ రెడ్డి గతంలో పహిల్వాన్ పురం గ్రామానికి చెందిన సంజీవ రెడ్డి అనే వ్యక్తిని హతమార్చిన విషయంలో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఎలిమినేటి సంజీవ రెడ్డిని హతమార్చిన చోటే వెంకట్ రెడ్డి హతం కావడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. భూతగాదాలు, పాతకక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నట్లు తెలిపారు.






