- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమ్ముడి కోసం అన్న… చివరికి ఇద్దరూ మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధానిలో ఢిల్లీలో తీవ్ర విషాదం నెలకొంది. ఈతకెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు గల్లంతై మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన అజయ్(23), కరణ్(19) తన స్నేహితుడు రాకేష్ కలిసి యమునా నదిలో ఈతకెళ్లారు. నదిలోకి దిగిన వీరిలో రాకేష్, కరణ్ మునిగిపోతుండగా… సమయానికి అటుగా ఓ వ్యక్తి పడవలో వచ్చి వారి కోసం తాడు విసిరాడు. దీంతో అజయ్ తాడు సహాయంతో పడవలోకి ఎక్కాడు. ఆ తరువాత కరణ్ కూడా పడవలోకి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధానిలో ఢిల్లీలో తీవ్ర విషాదం నెలకొంది. ఈతకెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు గల్లంతై మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన అజయ్(23), కరణ్(19) తన స్నేహితుడు రాకేష్ కలిసి యమునా నదిలో ఈతకెళ్లారు. నదిలోకి దిగిన వీరిలో రాకేష్, కరణ్ మునిగిపోతుండగా… సమయానికి అటుగా ఓ వ్యక్తి పడవలో వచ్చి వారి కోసం తాడు విసిరాడు. దీంతో అజయ్ తాడు సహాయంతో పడవలోకి ఎక్కాడు. ఆ తరువాత కరణ్ కూడా పడవలోకి వచ్చాడు. అయితే రాకేష్ మాత్రం తాడు అందుకోలేకపోవడంతో మునిగిపోయాడు. దీంతో పడవలో ఉన్న సోదరుడు అజయ్ తమ్ముడిని కాపాడటంతో కోసం నదిలోకి దూకాడు. చివరికి తమ్ముడిని కాపాడుకోలేక.. తాను పైకి రాలేక ఇద్దరు జల సమాధి అయ్యారు.
Next Story






