- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాసు పుస్తకాల కోసం అన్నను చంపారు
<p>దిశ, చేవెళ్ళ: భూ తగాదాలతో వల్ల సొంత అన్నను ఇద్దరు తమ్ముళ్లు కర్రలు, గొడ్డళ్లతో నరికి చంపారు. ఈ ఘటన శంకర్ పల్లి మండలం టంగుటూరులో శుక్రవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. టంగుటూరు గ్రామానికి చెందిన యాదయ్య (45) పరమయ్య, పాండు, శ్రీనివాస్, రాజు ఐదుగురు అన్నదమ్ములు. వీరికున్న రెండు ఎకరాల భూమిని ఐదుగురు పంచుకున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు యాదయ్య వద్ద ఉన్నాయి. పాండు, శ్రీనివాస్ శుక్రవారం యాదయ్య ఇంటికి వెళ్లి పాసు పుస్తకాల గురించి […]</p>

దిశ, చేవెళ్ళ: భూ తగాదాలతో వల్ల సొంత అన్నను ఇద్దరు తమ్ముళ్లు కర్రలు, గొడ్డళ్లతో నరికి చంపారు. ఈ ఘటన శంకర్ పల్లి మండలం టంగుటూరులో శుక్రవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. టంగుటూరు గ్రామానికి చెందిన యాదయ్య (45) పరమయ్య, పాండు, శ్రీనివాస్, రాజు ఐదుగురు అన్నదమ్ములు. వీరికున్న రెండు ఎకరాల భూమిని ఐదుగురు పంచుకున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు యాదయ్య వద్ద ఉన్నాయి. పాండు, శ్రీనివాస్ శుక్రవారం యాదయ్య ఇంటికి వెళ్లి పాసు పుస్తకాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో అన్నదమ్ములు గొడవపడ్డారు. మాటా మాటా పెరిగి తమ్ముళ్లు పాండు ,శ్రీనివాస్ కర్రలు, గొడ్డళ్లతో దాడి చేసి నరికి చంపారు. యాదయ్య రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేసుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారన్నారు.






