- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్తి తగాదాలు..తమ్ముడి కొడుకును కాపాడబోయి పెద్దనాన్న కూడా మృతి
<p>దిశ, నిజామాబాద్: ఆస్తి తగాదాలు ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాయి. అలిసాగర్ లిఫ్ట్ పంపు హౌస్ కెనాల్‌లో దూకిన తమ్ముడి కొడుకును కాపాడబోయి పెద్దనాన్న కూడా ప్రమాదవశాత్తు మృతి చెందాడు.ఈ ఘటన నిజమాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..ఎడపల్లి మండలం పోచారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అశోక్ సింగ్‌కు అతని తమ్ముడి కొడుకు సంతాన్ సింగ్‌కు ఆస్తి తగాదాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే సంతాన్ సింగ్ చనిపోతా అంటూ ఈ రోజు మధ్యాహ్నం అలిసాగర్ పంప్ […]</p>

దిశ, నిజామాబాద్:
ఆస్తి తగాదాలు ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాయి. అలిసాగర్ లిఫ్ట్ పంపు హౌస్ కెనాల్‌లో దూకిన తమ్ముడి కొడుకును కాపాడబోయి పెద్దనాన్న కూడా ప్రమాదవశాత్తు మృతి చెందాడు.ఈ ఘటన నిజమాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..ఎడపల్లి మండలం పోచారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అశోక్ సింగ్‌కు అతని తమ్ముడి కొడుకు సంతాన్ సింగ్‌కు ఆస్తి తగాదాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే సంతాన్ సింగ్ చనిపోతా అంటూ ఈ రోజు మధ్యాహ్నం అలిసాగర్ పంప్ హౌస్ కెనాల్‌లో దుకాడు. అతన్ని కాపాడటానికి వెళ్లిన మాజీ సర్పంచ్ అశోక్ సింగ్ కూడా ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోవడంతో పోచారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






