అన్న బైకు ఇవ్వలేదని తమ్ముని ఆత్మహత్య

by Batti.Sumithra |

<p>దిశ, అలంపూర్: అవసరం కోసం తన అన్న బైక్ ఇవ్వలేదని ఆవేదన చెంది ఓ తమ్ముడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పైసా మండలం కుంకనూరు గ్రామంలో జరిగింది. ఇందుకు సంబంధించి ఎస్సై జగదీష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పరశురాములు(20) కు తన తండ్రి గ్యాస్ బుక్ లో పేరు మార్పు చేసుకు రావాలని ఆదేశించాడు. అందుకుగాను బైక్ ఇవ్వమని తన అన్నను అడిగాడు. అన్న బైక్ ఇవ్వకపోవడంతో మనోవేదన చెంది బుధవారం గ్రామ [&hellip;]</p>

అన్న బైకు ఇవ్వలేదని తమ్ముని ఆత్మహత్య
X

దిశ, అలంపూర్: అవసరం కోసం తన అన్న బైక్ ఇవ్వలేదని ఆవేదన చెంది ఓ తమ్ముడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పైసా మండలం కుంకనూరు గ్రామంలో జరిగింది. ఇందుకు సంబంధించి ఎస్సై జగదీష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పరశురాములు(20) కు తన తండ్రి గ్యాస్ బుక్ లో పేరు మార్పు చేసుకు రావాలని ఆదేశించాడు.

అందుకుగాను బైక్ ఇవ్వమని తన అన్నను అడిగాడు. అన్న బైక్ ఇవ్వకపోవడంతో మనోవేదన చెంది బుధవారం గ్రామ వ్యవసాయ పొలం లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వైద్యం కోసం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించాడని ఎస్ఐ తెలిపారు.

Next Story