- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. నిశ్చితార్థం అయిన నెల రోజులకే..
<p>దిశ, నర్సంపేట: టిప్పర్ లారీ ఢీ కొని అన్నా చెల్లెలు మృతి చెందిన సంఘటన నర్సంపేట బిట్స్ కాలేజీ వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. దబీరుపేట గ్రామానికి చెందిన మొగుళ్ల రమేష్, విజయలు నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. దీనితో వీరి కుమారుడు మొగుళ్ల రాకేశ్ ఇంటర్మీడియట్ తో చదువు ఆపి పనిచేస్తూ చెల్లిని డిగ్రీ చదివించాడు. చెల్లెలి పెళ్లి నిశ్చితార్థం కూడా చేశాడు. గత నెలలో రాకేశ్ కూడ వరంగల్ కి చెందిన […]</p>

దిశ, నర్సంపేట: టిప్పర్ లారీ ఢీ కొని అన్నా చెల్లెలు మృతి చెందిన సంఘటన నర్సంపేట బిట్స్ కాలేజీ వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. దబీరుపేట గ్రామానికి చెందిన మొగుళ్ల రమేష్, విజయలు నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. దీనితో వీరి కుమారుడు మొగుళ్ల రాకేశ్ ఇంటర్మీడియట్ తో చదువు ఆపి పనిచేస్తూ చెల్లిని డిగ్రీ చదివించాడు. చెల్లెలి పెళ్లి నిశ్చితార్థం కూడా చేశాడు. గత నెలలో రాకేశ్ కూడ వరంగల్ కి చెందిన యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు.
ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం రాకేశ్ నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా తన చెల్లెలు ప్రసన్న ని తీసుకొని వరంగల్ ఏ.పి 10 ఏటి 8008 సి.బి.జెడ్ బైక్ పై వరంగల్ వైపు వెళుతుండగా, వరంగల్ నర్సంపేట వైపు వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో అన్నా చెల్లెలు ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటనతో ఖానాపూర్ మండలం దబీరుపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.







