అదంతా పాస్ట్.. డాక్యుమెంటరీస్ చూస్తే తల తిరుగుతుంది: Britney Spears

by  |
అదంతా పాస్ట్.. డాక్యుమెంటరీస్ చూస్తే తల తిరుగుతుంది: Britney Spears
X

దిశ, సినిమా: న్యూయార్క్ టైమ్స్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ జీవితంపై డాక్యుమెంటరీ రిలీజ్ చేసింది. ‘కంట్రోలింగ్ బ్రిట్నీ స్పియర్స్’ పేరుతో వచ్చిన ఈ డాక్యుమెంటరీపై స్పందించిన ఆమె.. ఇందులో చెప్పిన కొన్ని అంశాలు నిజం కాదని చెప్పింది. వైట్ డ్రెస్‌లో ఉన్న వీడియో షేర్ చేసిన భామ… ‘నిజంగా క్రేజీగా ఉంది. లాస్ట్ డాక్యుమెంటరీ చూసి చాలా సార్లు తల గీసుకున్నాను. ఈ డ్రామా నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నా. నంబర్ వన్.. అది పాస్ట్. నంబర్ టు.. క్లాసీ డైలాగ్స్ లేవా?. నంబర్ 3.. ప్రపంచంలోనే నాకు సంబంధించిన అత్యంత అందమైన ఫుటేజీ వినియోగించారు’ అని సెటైర్ వేసింది. ఇకపై ఇలాంటి డాక్యుమెంటరీస్ చేస్తే సొసైటీలో తన గౌరవం, మర్యాద పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రీసెంట్‌గా బ్రిట్నీ ఫియాన్స్ కూడా స్పందించిన విషయం తెలిసిందే.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed