అంబులెన్స్‌లో మహిళ ప్రసవం.. వారి సేవకు పలువురి అభినందన..

by Web Desk |
అంబులెన్స్‌లో మహిళ ప్రసవం.. వారి సేవకు పలువురి అభినందన..
X

దిశ, లింగాల: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని కోమటికుంటదిశ, లింగాల: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని కోమటికుంట గ్రామానికి చెందిన తప్పా స్వప్న అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా.. ఆశా వర్కర్ లలిత 108కి సమాచారం అందించింది. సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన లింగాల మండలం 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళాను నాగర్ కర్నూలు ఏరియా హాస్పిటల్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో స్వప్నకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో వైద్యుల సలహా మేరకు 108 అంబులెన్స్‌లో సాధారణ ప్రసవం చేశారు. ఈ ప్రసవంలో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ లక్ష్మణ్ తెలిపారు. వీరిని నాగర్ కర్నూల్ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అంబులెన్స్ సిబ్బంది సేవను పలువురు అభినందించారు.


Next Story