రామన్నపేట బాలుడికి అండగా సంపూర్ణేష్ బాబు.. గుండె ఆపరేషన్‌కు ఆర్థిక సాయం..

by Web Desk |
రామన్నపేట బాలుడికి అండగా సంపూర్ణేష్ బాబు.. గుండె ఆపరేషన్‌కు ఆర్థిక సాయం..
X

దిశ, సినిమా: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. హీరోగా, ఆర్థికంగా ఎదిగినప్పటి నుంచి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్న నటుడు.. తాజాగా ఓ కుంటుంబానికి ఆర్థిక సాయం చేసి మనసున్న మనిషిగా ప్రశంసలు అందుకుంటున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రామన్నపేట గ్రామానికి చెందిన రెండు నెలల బాలుడు శివ.. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. వ్యాధి నయం కావాలంటే రూ. 10 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో.. గ్రామస్తులంతా కలిసి విరాళాలు సేకరించారు. ఈ విషయం సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న సంపూర్ణేష్.. నేరుగా రామన్నపేటకు వెళ్లి బాలుడి కుటుంబానికి రూ. 25 వేలు ఆర్థిక సాయాన్ని అందించారు. అంతేకాదు త్వరలో సమస్యను బట్టీ మరింత సాయం చేసేందుకు సిద్ధమేనంటూ వాళ్లకు ధైర్యం చెప్పారు.

https://www.instagram.com/p/BGvzmDORzxk/?utm_source=ig_web_copy_link



Next Story