- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవర్ స్టార్ కి డాక్టరేట్.. సున్నితంగా తిరస్కరించిన జనసేనాని
అభిమానుల ఆరాధ్య దైవం.. జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అరుదైన గౌరవం దక్కింది.

దిశ వెబ్ డెస్క్: అభిమానుల ఆరాధ్య దైవం.. జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడుకి చెందిన వేల్స్ యూనివర్సిటీ జనసేనానికి డాక్టరేట్ ప్రదానం చేసేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో జరగనున్న తమ యూనివర్సిటీ 14వ కన్వకేషన్ కార్యక్రమానికి హాజరై డాక్టరేట్ అందుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం యూనివర్సిటీ అందించాలనుకుంటున్న పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించి..డాక్టరేట్ అందుకోవడానికి నిరాకరించారు.
కాగా వివిధ రంగాలలో గొప్పగా రాణించిన ప్రతిభావంతులైన వ్యక్తులు చాలా మంది ఉన్నారని.. అలాంటి వారికి డాక్టరేట్ ఇవ్వాలని కోరారు పవన్ కళ్యాణ్. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వేల్స్ యూనివర్సిటీకి లేఖ రాశారు కళ్యాణ్. ఆ లేఖ లో వేల్స్ యూనివర్సిటీ తనను డాక్టరేట్ కి ఎంపిక చేయడం సంతోషంగా ఉందని.. అయితే తనకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారని.. వాళ్లకు ఈ డాక్టరేట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నానని .. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ కారణంగా యూనివర్సిటీ 14వ కన్వకేషన్ కార్యక్రమానికి కూడా హాజరు కాలేకపోతున్నానని లేఖలో ప్రస్తావించారు పవన్ కళ్యాణ్.






