- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > బ్రేకింగ్ న్యూస్ > బ్రేకింగ్ : రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టివేత... నలుగురు అరెస్ట్
బ్రేకింగ్ : రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టివేత... నలుగురు అరెస్ట్
by Kema Shiva Kumar |
రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే వినపడకుండా చేస్తామని ప్రకటనలు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి అందుకు అనుగుణంగా పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే వినపడకుండా చేస్తామని ప్రకటనలు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి అందుకు అనుగుణంగా పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ తీసుకుంటున్న, సరఫరా చేస్తున్న వారిని ఏమాత్రం ఊపేక్షించకూడదని వారికి దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాజస్థాన్ నుంచి హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వారి వద్ద ఉన్న 150 గ్రాముల హెరాయిన్, 30 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు పంపారు.
Next Story






