తెరపైకి బాహుబలి-3.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

by Dishanational2 |
తెరపైకి బాహుబలి-3.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
X

దిశ, వెబ్‌డెస్క్ : బహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల వర్షం కురిపించింది బహుబలి. ఇక వెయ్యి కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఎన్నో ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా దర్శకుడు రాజమౌళి బహుబలి 1,2 చిత్రాల ద్వారా టాలీవుడ్ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు. మగధీర, ఈగ, బహుబలి 1,2 తో జక్కన్న తన మార్క్ చూపెట్టాడు. ఇక ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకోవడానికి జక్కన్న రెడీ అయ్యాడు. కాగా, ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్‌లో ఉన్న ఆయన ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆసక్తికర కామెంట్ చేశాడు. ఇప్పటికే చాలా మంది దర్శకుడు రాజమౌళిని బహుబలి 3పై ఎన్నో ప్రశ్నలు సంధించారు. వాటన్నింటికి చెక్ పెడుతూ ఆయన బహుబలి3 పై క్లారిటీ ఇచ్చాడు. ఓ యాంకర్ బహుబలి 3 గురించి ప్రశ్నించగా.. రాజమౌళి దానికి స్పందిస్తూ.. బహుబలి చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలను చూపించనున్నాం. దీనిపై వర్క్ చేస్తున్నాం.బాహుబలి-3పై నిర్మాత శోభు కూడా సుముఖంగా ఉన్నారని అన్నారు. దీన్ని తీయడానికి కాస్త టైం పట్టొచ్చు. కానీ బాహుబలి నుంచి ఆసక్తికర వార్త రానుందని ఆయన తెలిపారు. దీంతో జక్కన్న బహుబలి 3పై క్లారిటీ ఇచ్చేశారు. త్వరలో సినిమా రానుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed