BREAKING : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు దుర్మరణం

by Kema Shiva Kumar |

రెండు టూరిస్ట్ బస్సులు ఢీకొని ఒకరు దుర్మరణం పాలైన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో నెమలినారాయణపురం వద్ద చోటుచేసుకుంది.

BREAKING : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్ : రెండు టూరిస్ట్ బస్సులు ఢీకొని ఒకరు దుర్మరణం పాలైన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో నెమలినారాయణపురం వద్ద చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన దాదాపు 98 మంది యాత్రికులు రెండు టూరిస్టు బస్సుల్లో ఒడిశాకు వెళ్లి పూరీ జగన్నాథుడిని దర్శించుకున్నారు. అనంతరం వారు అన్నవరం సత్యనారాయణ దర్శించుకునేందుక వస్తుండగా పలాస సమీపంలో జాతీయ రహదారిపై బస్సు సడెన్ బ్రేక్‌ వేయడంతో వెనుక నుంచి వచ్చిన మరో బస్సు ఆ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, సుమారు 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ప్రయాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం గాయపడిన వారిని పలాస ప్రభుత్వాసుత్రికి తరలించారు.

Next Story