పేస్-భూపతి బ్రొమాన్స్ అండ్ బ్రేకప్‌పై సిరీస్..

50

దిశ, సినిమా : ఇండియన్ టెన్నిస్ హీరోలు లియాండర్ పేస్, మహేష్ భూపతి విడిపోవడం పలు ఊహాగానాలకు తెరతీసింది. 90వ దశకంలో టెన్నిస్ కోర్టులో ఎన్నో చరిత్రలు సృష్టించిన ఇద్దరు.. 1999లో డబుల్స్‌ విభాగంలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచారు. అలాంటి ఇద్దరు స్నేహితులు ఎందుకు విడిపోయారనే కథను జీ5.. సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఏడు ఎపిసోడ్స్‌తో కూడిన సిరీస్‌కు బ్రేక్ పాయింట్ టైటిల్ ఫైనలైజ్ చేయగా.. ఎర్త్ స్కై బ్యానర్‌పై అశ్వినీ అయ్యర్ తివారీ, నితీశ్ తివారీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజైన మహేష్ భూపతి, లియాండర్ పేస్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..