- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఆనందయ్య మందుకు పంపిణీకి బ్రేక్.!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నివారణ కోసం నెల్లూరు కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. ఆయుర్వేద మందును కనుగొన్న విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి ఈ మందుపై కాంట్రవర్సీ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆనందయ్య మందుపై హైకోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మందు పంపిణీపై ఏపీ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. కంట్లో వేసే మందులో హానికర రసాయనాలు ఉన్నట్టు పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టులో విచారణ సందర్భంగా.. ప్రభుత్వం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నివారణ కోసం నెల్లూరు కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. ఆయుర్వేద మందును కనుగొన్న విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి ఈ మందుపై కాంట్రవర్సీ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆనందయ్య మందుపై హైకోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మందు పంపిణీపై ఏపీ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
కంట్లో వేసే మందులో హానికర రసాయనాలు ఉన్నట్టు పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టులో విచారణ సందర్భంగా.. ప్రభుత్వం తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ.. చుక్కల మందును 5 ల్యాబ్‌ల్లో పరీక్షించినట్టు వెల్లడించారు. అనంతరం కోర్టు.. ల్యాబ్‌ల నివేదిక తమ ముందు ఉంచాలని హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలో పిటిషనర్ చుక్కల మందును ఆయుష్ కేంద్రంలో పరీక్షించాలని కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను హైకోర్టు జూలై 1వ తేదీకి వాయిదా వేసింది.
Next Story






