విడాకులు ఇచ్చి నాతో వస్తే రూ.3.70 కోట్లు ఇస్తా.. మోడల్ కి బంపర్ ఆఫర్.. ట్విస్ట్ ఏంటంటే..?

685

దిశ, వెబ్‌డెస్క్: బ్రెజిల్ అందాల భామ, మోడల్ క్రిస్ గలేరా గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆమె అందం అలాంటిది.. ఆమె చేసిన పని కూడా అలాంటిదే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లతో కుర్రకారును నిద్రపోనివ్వకుండా చేసిన ఈ భామ ఇటీవలే వివాహం చేసుకొని ఒక ఇంటిది అయ్యింది. ఆ వివాహంతోనే అమ్మడు స్టార్ గా నిలిచింది. అదేంటి వివాహంతో స్టార్ అవ్వడమేంటి అనుకుంటున్నారా..? మరి అమ్మడు పెళ్లి చేసుకొంది ఎవరినో కాదు తనకు తానే వివాహం చేసుకోంది. దానికి బోల్డంత డబ్బు ఖర్చుపెట్టి బ్రెజిల్ లోని సావో పోలో చర్చిలో వివాహం చేసుకోవడానికి ముందు గలేరా తీసుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ఈ ఫోటోలు చూసిన ఒక అరబ్ షేక్ అమ్మడికి బంపర్ ఆఫర్ ఇచ్చాడంట. ఈ భామ అందానికి ఫిదా అయిన షేక్.. తనని పెళ్లి చేసుకొంటే అక్షరాలా రూ.3.70 కోట్లు ఇస్తానని చెప్పాడు. నీకు నువ్వు పెళ్లి చేసుకున్నావ్ కాబట్టి.. నీకు నువ్వే విడాకులు ఇచ్చేసి నాతో జతకట్టు అని ప్రాధేయపడ్డాడంట. ఇక అతగాడి ఆఫర్ పై స్పందించిన మోడల్.. నీ ఆఫర్ నాకు బాగా నచ్చింది కానీ.. డబ్బుతో నా ఫ్రీడమ్ ని కొనలేవు అంటూ ఘాటుగానే సమాధానమిచ్చిందట. డబ్బు కోసం వివాహం చేసుకోను అని సున్నితంగా ఆ ఆఫర్ ని తిరస్కరించింది. ప్రస్తుతం గలేరా గురించి సోషల్ మీడియాలో ఓ డిబేట్ యే నడుస్తోంది. ఇంత పిచ్చిదేంటి.. అంట డబ్బు వస్తుంటే.. పెళ్లి చేసుకోను అంటుంది అని కొందరు అంటుంటే.. ఇదెక్కడి పోయేకాలం తనను తాను పెళ్లి చేసుకోవడం.. తనకు తాను విడాకులు ఇచ్చుకోవడం ఏంటీ విడ్డూరం కాకపోతే అంటూ నవ్వుకుంటున్నారు.

నదిలో ఏనుగు.. దానిని కాపాడబోయి జర్నలిస్ట్ మృతి

https://www.instagram.com/p/CTxr15_LqwI/

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..