ఈ లోకంలో అర్థం కాని శక్తులున్నాయి : స్టార్ హీరో

by  |
Brahmastra
X

దిశ, సినిమా : రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్‌ యాక్షన్‌ అండ్ ఫిక్షన్‌ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. సినిమా మూడు భాగాలుగా విడుదలకానుండగా.. మొదటి భాగం ‘శివ’కు సంబంధించి రిలీజైన మోషన్‌ పోస్టర్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘ఈ లోకంలో ఏదో జరుగుతోంది. ఈ విషయం మామూలు మనుషులకు అస్సలు అర్థం కాదు. పురాతన శక్తులతో పాటు కొన్ని అస్త్రాలున్నాయి’ అని రణ్‌బీర్‌ చెప్పిన డైలాగ్‌తో మొదలైన మోషన్ పోస్టర్‌లో.. ‘బ్రహ్మండం యొక్క మహా శక్తివంతమైన అస్త్రం జాగృతమవుతుంది’ అనే కొటేషన్‌ ఆలోచింపజేస్తోంది.

అయితే ‘అవన్నీ నీకే ఎందుకు కనపడుతున్నాయ్? అసలు నువ్వు ఎవరు శివ?’ అంటూ ఆలియా ప్రశ్నించగా.. చివరన నెత్తుటి మరకలతో త్రిశూలం చేతబూని దర్శనమిచ్చాడు రణ్‌బీర్. కాగా కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున కీలకపాత్రలు పోషించిన ‘బ్రహ్మాస్త్ర’ మొదటి భాగం 9.9.2022న తెలుగులో కూడా విడుదల కానుంది.



Next Story

Most Viewed