'శ్రీ శ్రీ' … బ్రహ్మానందం పెన్సిల్ స్కెచ్!

by  |
శ్రీ శ్రీ … బ్రహ్మానందం పెన్సిల్ స్కెచ్!
X

నవరసాలలో కష్టమైనది హాస్య రసం అంటుంటారు. కానీ హాస్యానికి కూడా నవ్వు తెప్పించే నటన ఆయన సొంతం. ఆయన పేరు వింటే చాలు తెలుగు ప్రజలకు పెదాలపై ఆటోమేటిక్ గా నవ్వొచ్చేస్తుంది. కడుపుబ్బ నవ్వించే ఆయన స్క్రీన్ పై కనిపిస్తే విజిల్స్ తో థియేటర్లు మారుమోగుతాయి. ఇప్పటికే అర్ధం అయి ఉంటుంది కదా… ఆయనెవరో… హహా… హాస్యబ్రహ్మ బ్రహ్మానందం.

ఒక లెక్చరర్… ఒక గొప్ప కమెడియన్ అయ్యాడు అంటే ఆయనలో మరెన్నో కళలు దాగి ఉన్నాయనే విషయం అర్ధం అవుతుంది.నిజమే.. ఆయనొక గొప్ప చిత్రకారుడు కూడా. ఆయనలో దాగిఉన్న కళల్లో నాకు నచ్చిన వాటిలో ఇది కూడా ఒకటని తెలిపాడు బ్రహ్మానందం కొడుకు, హీరో గౌతమ్. ఆ కళతో రీకనెక్ట్ అయ్యేందుకు సమయం దొరికినందుకు ఆనందంగా ఉన్నానని తెలిపారు. లాక్ డౌన్ పీరియడ్ వల్ల నాన్న ఒక చిత్రాన్ని గీయడం చాలా సంతోషంగా ఉందంటూ… ఆయన అభిమాని కవి శ్రీశ్రీ పెన్సిల్ స్కెచ్ ను గీశాడని తెలిపాడు. సోషల్ మీడియా వేదికగా బ్రహ్మీ గీసిన శ్రీశ్రీ గారి ఫోటోను పంచుకున్నారు గౌతమ్.

Tags : Brahmanandam, Hollywood, Comedy, Icon

Next Story